రెండు నాలుకల చంద్రబాబు మరోసారి రెండు కండ్ల సిద్ధాంతాన్ని బయటకు తీశారు. బడాయిల బాబు మరోసారి బొంకుల పురాణం వినిపించారు. నదుల అనుసంధానం పేరుతో మరోసారి తెలంగాణను ఎండబెట్టి, గోదావరిని కొల్లగొట్టడానికి బనకచర్ల బాగోతం మొదలు పెట్టిన చంబ్రాబు నోట సరికొత్తగా ‘తెలుగు నేలకు జల హారతి’ అనే వినూత్న పదం పురుడుపోసుకున్నది. ఆయన దృష్టిలో తెలుగు నేల అంటే ఆంధ్రప్రదేశ్ అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్‌కు జలహారతి అన్నమాట. ఆంధ్రాకు గోదావరి నీళ్లు ఎత్తుకుపోయే తరుణం సమీపించగానే ‘సమ న్యాయం’ రాగం అందుకున్న బాబు పాత సంగతులన్నీ మరిచిపోయారు.
తానెప్పుడూ కాళేశ్వరాన్ని వ్యతిరేకించలేదని, గోదావరి మీద ప్రాజెక్టులను వ్యతిరేకించలేదంటూ బడాయిలు మొదలుపెట్టారు. అంతేకాదు.. మొన్నటిదాకా హైదరాబాద్‌ను తానే కట్టిన అని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. 2014 తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం పెరగడానికి 2004లోనే గద్దె దిగిపోయిన తాను నాంది పలికానంటూ వింత వ్యాఖ్యలు చేశారు. ‘అంతా నాదే’ అనే తన సొంత డబ్బాకు కాదేదీ అనర్హం అని నిరూపించుకున్నారు.
Chandrababu Naidu | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 28 (నమస్తే తెలంగాణ): అబద్ధానికి అంగీ, లాగు తొడిగితే చంద్రబాబు రూపాన్ని సంతరించుకుంటదని తెలంగాణవాదులు, రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తుంటారు. చంద్రబాబు తాజా ప్రవర్తన దీనికి మరో ఉదాహరణగా నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఏపీ సీఎం చంద్రబాబు విషం చిమ్మడం మొదలుపెట్టారు. అధికారంలో ఉన్న ఐదేండ్లపాటు తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేశారు. కానీ బుధవారం ఏపీలోని కడపలో జరిగిన మహానాడులో మాత్రం తాను కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదంటూ అబద్ధం ఆడారు. ‘ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ! నేను ఏం చెప్పినా నడుస్తుందిలే..’ అనేది ఆదినుంచీ చంద్రబాబు నైజం. చివరకు తాను ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన దేవాదుల ప్రాజెక్టుపై కూడా తానే ఫిర్యాదు చేసిన చరిత్ర చంద్రబాబుది.
బనకచర్ల కోసం కొత్త డ్రామా
గతంలో ఏపీ సీఎంగా తెలంగాణ ప్రాజెక్టులపై విషం చిమ్మిన చంద్రబాబు, ఇప్పుడు బనకచర్ల కోసం కొత్త డ్రామాకు తెరలేపారు. కేంద్రంలో చక్రం తిప్పుతూ మేడిగడ్డను పడావు పెట్టడంలో తనదైన పాత్ర పోషించిన ఆయన తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. తాను ఎన్నడూ ఆ ప్రాజెక్టును వ్యతిరేకించలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. పోలవరం కోసం ఐదు మండలాలను ఏపీలో కలపాలని, అప్పటివరకు తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేదిలేదంటూ కేంద్రం ముందు షరతు పెట్టిన బాబు.. ఇప్పుడు గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు నీతి వాక్యాలు వల్లిస్తున్నారు. కొత్త రాష్ట్రం… ఉమ్మడి రాష్ట్రంలో నదీజలాల్లో తీవ్ర అన్యాయానికి గురైన ప్రాంతం కావడంతో ఏడాదిపాటు మథనం చేసిన కేసీఆర్… 2015లో రీడిజైనింగ్ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఇక అంతే! 2015లో కేంద్రంతోపాటు నదీ యాజమాన్య బోర్డులకు ఫిర్యాదు లేఖలను మొదలుపెట్టిన బాబు అండ్ కో 2019 ఎన్నికల్లో ఓటమి చెందే వరకు విషం చిమ్ముతూనే ఉన్నా రు.
కృష్ణాపై నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి… చివరకు చిన్న లిఫ్టు స్కీం అయిన తుమ్మిళ్లను సైతం వదల్లేదు. ఖమ్మం జిల్లాలో స్థిరీకరణ కోసం చేపట్టిన భక్త రామదాసు లిఫ్టు స్కీం కూడా చంద్రబాబు చూపు నుంచి తప్పించుకోలేకపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టును తాను వ్యతిరేకించలేదంటూ ఇప్పుడు చిలుకపలుకులు పలుకుతున్న చంద్రబాబు… అనేకసార్లు అది కొత్త ప్రాజెక్టు, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేనిదే ఎలా అనుమతిస్తారంటూ కేంద్రానికి ఫిర్యాదులు పంపారు. సముద్రంలోకి వృథాగా పోయే నీళ్లే కదా… అని బనకచర్ల విషయంలో నీతులు వల్లిస్తున్న ఆయన 13.6.2018న కాళేశ్వరంపై చేసిన ఫిర్యాదులో ‘ఎగువ రాష్ర్టాల వినియోగాన్ని లెక్కల్లోకి తీసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలా అనుమతులు ఇస్తారు?’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు. మరి ఇదే బనకచర్ల విషయంలో ఎగువ రాష్ట్రమైన తెలంగాణ వినియోగాన్ని పట్టించుకోకపోవడం చంద్రబాబు అబద్ధాలను ఎంత సులువుగా ఆడతారో స్పష్టంచేస్తున్నది. అంతేకాదు, కాళేశ్వరం ప్రాజెక్టుకు ట్రిబ్యునల్ కేటాయింపులు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్‌తో ఒప్పదం జరిగిందా? అని కూడా అదే లేఖలో ప్రశ్నించారు. మరి అదే బనకచర్లకు మాత్రం ఇవేవీ పట్టడం లేదు.కొసమెరుపు చంద్రబాబు తమ పార్టీ ఎంపీ సీఎం రమేశ్తోనూ రాజ్యసభలో ఫిర్యాదుల రూపంలో ప్రశ్నలు కూడా వేయించారు.
ఎంపీ సీఎం రమేశ్ వేసిన ప్రశ్న: కేంద్ర జల సంఘంతో డీపీఆర్‌లను ఆమోదించుకోకుండానే పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్లు 84(3), 85(8)(డీ), పదకొండో షెడ్యూల్లోని పారా-7ను ఉల్లంఘించినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఫిర్యాదు అందిందా? అందితే.. ఆ ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేసేందుకు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ఎలాంటి చర్యలు తీసుకున్నది?
కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ సన్వర్‌లాల్ జాట్ ఇచ్చిన సమాధానం: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ రెండు ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే, వీటికి సంబంధించి కేంద్రానికి ఎలాంటి సాంకేతిక-ఆర్థిక అంచనాలు (టెక్నో-ఎకనామికల్ అప్రైసల్) అందలేదు. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం 22.8.2015న స్పష్టంగా ఒక లేఖ కూడా రాసింది. అందులో ఈ రెండు ప్రాజెక్టులు కొత్తవి కావని, అపాయింటెడ్ తేదీ తర్వాత చేపట్టలేదని స్పష్టం చేసింది. దీంతో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట ఉల్లంఘన అనేది జరగలేదు.
మంత్రివర్గంలో ఫిర్యాదులకు ఆమోదం
ఒక రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పొరుగు రాష్ట్ర ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేయాలనే ఎజెండాను చేర్చి ఆమోదించిన ఘనత చంద్రబాబుకు దక్కింది. 2016లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మేడిగడ్డ వద్ద అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. దాన్ని జీర్ణించుకోలేని అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు ఏకంగా మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేయాలని చర్చించి, తీర్మానం చేశారు. అంతేకాదు, ఉమ్మడి ఏపీలో కేసీఆర్ ప్రారంభించిన తెలంగాణ ఉద్యమ వేడికి తట్టుకోలేక చంద్రబాబు దేవాదుల ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలను మభ్య పెట్టేందుకు దారి లేని ప్రాంతానికి హెలికాప్టర్లో మేస్త్రీని ఎక్కించుకొని వెళ్లి హడావుడిగా శంకుస్థాపన చేశారు. అసలు నీటి నిల్వ లేకుండా చేపట్టిన ఆ ప్రాజెక్టును అటకెక్కించకుండా, వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కేసీఆర్ 2015 ఆగస్టు, 18న దేవాదుల ఇన్‌టేక్ పాయింట్ దిగువన 2.5 కిలోమీటర్ల ప్రాంతంలో ఒక బరాజ్ నిర్మాణానికి సర్వే కోసం జీవో 607 జారీ చేశారు. ఆ జీవోపై కూడా చంద్రబాబు ఫిర్యాదు చేసి తెలంగాణపై తనకున్న విషాన్ని వెళ్లగక్కారు.
2014-2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం