KCR | పచ్చని పంట చేనును, పుట్లకొద్దీ వడ్లరాశిని, నవ్వుతున్న రైతును చూస్తే ‘రోటీ-కపడా..’ రోతపాట బ్యాచ్ తట్టుకోలేకపోయింది. ‘సాగు ఆగమైంది’, ‘కేసీఆర్ అన్నదాతల్ని పట్టించుకోలేదు’ ‘నమ్మండి.. అంతా ధ్వంసమైపోయింది’ అంటూ హిప్నటైజ్ చేసేందుకు కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నించింది. అబద్ధాలన్నీ పేర్చి చేసిన గారడీని నమ్మి కాడి పడేసిన వాళ్లూ ఉన్నారు. పాల సముద్రమైనా సరే.. పగిలిపోవడానికి చిన్న చింతపండు ముక్క చాలదా? అమృత కలశాన్ని గరళమయం చేసేందుకు ఒక్క విషపుచుక్క చాలదా? ఇది కదా ‘ఫుడ్ పాయిజన్’!!!
కేసీఆర్ దిద్దిన ఎవుసానికి కితాబిచ్చి, కాంగ్రెస్ రుద్దిన అబద్ధాలను ఎండగట్టింది ఆర్బీఐ నివేదిక.
తెలంగాణ సాధించిన సాగు విప్లవం విలువెంతో ఇప్పటికైనా వెల్లడైందని సంతోషించాల్నా?!
ఆ స్వర్ణయుగాన్ని సత్తురేకు కోసం వదిలేసుకుని, మోసపోయిన రైతును చూసి బాధపడాల్నా?!
రెక్కలిరిగిన రైతులు.. డొక్కలెండిన పశువులు.. బీళ్లు బారిన భూములు.. నోళ్లు తెరిచిన బావులు.. పడావు పొలాలు.. కరెంటు పడిగాపులు.. బాయికాడ జాగారాలు.. చెప్పుల బారులు.. వలసల వలపోతలు.. బక్క రైతు బలవన్మరణాలు.. 60 ఏండ్ల కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ పరిస్థితి ఇదే!. ‘రోటీ.. కపడా’ అంటూ ఓటి మాటలతో ఉన్న గోచీనీ ఊడగొట్టింది కాంగ్రెస్. దేశమంతా రైతులు సాగుసంక్షోభంతో సంఘర్షణ సాగిస్తుంటే.. తెలంగాణ రైతన్న మాత్రం సమైక్య పాలకులతోనూ పోరాడాల్సి వచ్చింది.
కేసీఆర్ రూపంలో కాలం కలిసివచ్చినప్పుడు.. కాళేశ్వరమనే నీళ్లు, కరెంటు అనే ఊతం దొరికినప్పుడు.. మోడువారిని చెట్టు లాంటి తెలంగాణ వ్యవసాయ రంగం కూడా పచ్చగా చిగురించింది. నాడు కాంగ్రెస్ పాలనలో పురుగులమందే పెరుగన్నమైతే.. కేసీఆర్ ఆ పెరుగన్నాన్ని పరమాన్నంగా మార్చాడు. తెలంగాణను ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా నిలిపాడు. కేసీఆర్ సాగు సంస్కరణలను రిజర్వ్‌బ్యాంక్ తన తాజా నివేదికలో ఎలుగెత్తి చాటింది. పదేండ్లలో సాగు విస్తీర్ణం 231 శాతం పెరిగింది. ధాన్యం దిగుబడి 280శాతం వృద్ధిచెందింది. మడి తడిపేందుకూ దుఃఖపడిన సందర్భం నుంచి మూడు పంటలకు సరిపోయే కోటి ఎకరాలకు నీళ్లందించే గొప్ప సంపద సృష్టించుకున్నాం. ఆహారోత్పత్తుల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.
పదేండ్లలో పెరిగినసాగు విస్తీర్ణం 231%
ధాన్యం ఉత్పత్తిలో వృద్ధి 280%
పదేండ్లలో పంట ఉత్పత్తుల విలువ 6.69 లక్షల కోట్లు
74.80% తెలంగాణలో అన్ని పంటల సాగు విస్తీర్ణంలో పెరుగుదల
కేసీఆర్ పాలనలో కొత్తగా156% పెరిగిన తెలంగాణ సాగునీటి పారకం
ప్రభుత్వమే రైతుల దగ్గర కొన్న వడ్లు737 లక్షల టన్నులు
కేసీఆర్ సర్కారు అందించిన రైతుబంధు పెట్టుబడి సాయం రూ.73 వేల కోట్లు
కేసీఆర్ హయాంలో తగ్గిన రైతు బలవన్మరణాలు 84 శాతం
పదేండ్ల పాలనలో వ్యవసాయరంగ అభివృద్ధికి కేసీఆర్ చేసిందేమీ లేదు. ఒక్క ఎకరాకు కూడా అదనంగాసాగునీళ్లు ఇచ్చింది లేదంటూ కాంగ్రెస్ చేసిన, చేస్తున్న విమర్శలకు ఆర్బీఐ అంకెలు చెంపదెబ్బలాంటి సమాధానం చెప్తున్నాయి. కాంగ్రెస్ విమర్శలు, ఆరోపణలన్నింటినీ రిజర్వు బ్యాంకు ఒక్క నివేదికతో కొట్టిపారేసింది. పదేండ్ల కేసీఆర్ పాలనలో వ్యవసాయ ప్రగతినికండ్ల ముందు ఉంచింది. పంటల సాగు విస్తీర్ణం 74.8 శాతం పెరిగింది.
పంటల ఉత్పత్తి 131.62 లక్షల టన్నులు పెరిగింది. సాగునీటి పారకం 155.99 శాతం పెరిగింది. వరిసాగు విస్తీర్ణం 231 శాతం పెరగ్గా… ధాన్యం ఉత్పత్తి 280 శాతం పెరిగింది. వీటన్నింటి ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తుల సంపద అక్షరాలా లక్ష కోట్లు పెరిగింది.
తెలంగాణ వ్యవసాయ ప్రగతిపై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) వెల్లడించిన లెక్కలు ఇవి. మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు దిద్దిన తెలంగాణ ఎవుసం ఇది.
కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్ర వ్యవసాయ ప్రగతిని ఆర్బీఐ తన నివేదికలో కండ్లకు కట్టింది. వ్యవసాయం ఏ విధంగా అభివృద్ధి చెందిదో, పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి ఏ విధంగా పెరిగిందో వివరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు మాత్రం తెలంగాణ వ్యవసాయ రంగానికి నాటి సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పదేండ్లలో ఒక్క ఎకరాకు కూడా అదనంగా సాగునీరు ఇవ్వలేదని చెప్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు ఆర్బీఐ లెక్కలే సమాధానం ఇస్తున్నాయి.
– హైదరాబాద్, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ)
రాష్ట్రంలో 2014-15తో పోల్చితే తొమ్మిదేండ్ల కాలంలో పంటల సాగు భారీగా పెరిగినట్టు ఆర్బీఐ వెల్లడించింది. సుమారు 74.8 శాతం పెరుగుదలతో పంటల సాగు విస్తీర్ణం ఏకంగా 98 లక్షల ఎకరాలు పెరిగినట్టు వెల్లడించింది. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో ఇంత భారీ విస్తీర్ణంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిన దాఖలాలు లేవు. ఈ ఘనత సాధించడం ఆషామాషీ కాదనే అభిప్రాయాన్ని వ్యవసాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం 2014-15లో రాష్ట్రంలో 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు కాగా 2022-23లో ఇది 2.29 కోట్ల ఎకరాలకు పెరిగింది.
కాళేశ్వరం ప్రాజెక్టు అంతా ఉత్తదేనని, దీని ద్వారా ఇతర ప్రాజెక్టుల ద్వారా పదేండ్ల పాలనలో కేసీఆర్ ఒక్క ఎకరాకు కూడా అదనంగా సాగు నీరు ఇవ్వలేదంటూ విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేతల నోళ్లు మూయించేలా ఆర్బీఐ నివేదిక వాస్తవాలను వెల్లడించింది. కాంగ్రెస్ నేతలు ఒక్క ఎకరం కూడా అదనంగా పారలేదంటుంటే ఆర్బీఐ మాత్రం గడిచిన తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో 97.48 లక్షల ఎకరాలకు సాగునీటి పారకం పెరిగినట్టు వెల్లడించింది. అంటే 156 శాతం పారకం పెరిగిందని పేర్కొంది. ఆర్బీఐ లెక్కల ప్రకారం 2014-15లో కేవలం 62.49 లక్షల ఎకరాలకు మాత్రమే నీటి పారకం ఉండగా 2022-23లో 159.97 లక్షల ఎకరాలకు పెరిగినట్టు వెల్లడించింది. నాటి సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు తర్వాత సాగునీటి గోస తీర్చడమే లక్ష్యంగా రూ. 1,64,210 కోట్లు వెచ్చించి కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టులను పూర్తి చేశారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చారు. ఫలితంగా ప్రాజెక్టుల వల్ల 17.23 లక్షల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందగా భూగర్భ జలాలు పెరగడంతో మొత్తంగా 98 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందడం గమనార్హం.
పెరుగుదల 155.99 శాతం
పెరిగిన సాగు పారకం 97.48 లక్షల ఎకరాలు
కారణం ఏదైనా కావొచ్చు రైతు అకాల మరణం ఆ రైతు కుటుంబాన్ని చెల్లాచెదురు చేసేది. ఈ ఇబ్బందులు చూసి చలించిన కేసీఆర్.. ఆ కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పించాలని నిర్ణయించి రైతుబీమా పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం కింద ఆ రైతు కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందేలా చేశారు. రైతుల తరఫున పాలసీ కోసం ఐదేండ్లలో ప్రభుత్వం రూ. 5383 కోట్లు చెల్లించింది. ఆ తర్వాత వివిధ కారణాలతో అకాల మరణం పొందిన లక్షకు పైగా రైతు కుటుంబాలకు రూ. 5039 కోట్లు పరిహారం అందింది.
తెలంగాణ వ్యవసాయరంగం ఏ స్థాయి లో అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఆర్బీఐ చెప్పిన ఈ ఒక్క లెక్క సరిపోతుంది. పదేండ్లలో 6.69 లక్షల కోట్ల విలువైన పంటలను ఉత్పత్తి చేసినట్టు ఆర్బీఐ వెల్లడించింది. 2014-15లో రూ. 41,706 కోట్ల విలువైన పంట ఉత్పత్తి కాగా ఇది 2023-24 నాటికి రూ. 1,02,359 కోట్లకు పెరిగింది. పదేండ్ల లో 145 శాతంతో రూ. 60,653 కోట్ల విలు వైన పంట ఉత్పత్తి పెరిగినట్టు వెల్లడించింది.
రైతులు పంట రుణాలతో కష్టాలు పడొద్దనే ఉద్దేశంతో రూ. లక్ష వరకు గల ఉన్న రుణాలను మాఫీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. తొలివిడుత ప్రభుత్వంలో 2014-2018 వరకు 35.32 లక్షల రైతులకు రూ.16,144 కోట్ల పంట రుణాలను మాఫీ చేసింది. రెండోసారి 23 లక్షల మంది రైతులకు రూ. 13 వేల కోట్ల రుణాలను మాఫీ చేసింది. 2014 నుంచి 2023 వరకు 58.29 లక్షల మందికి రూ. 29, 144కోట్ల రుణాలను కేసీఆర్ సర్కారు మాఫీ చేసింది.
సీఎం కేసీఆర్ తన చాతుర్యంతో రాష్ర్టాన్ని, రైతులను విద్యుత్తు సంక్షోభం నుంచి గట్టెక్కించారు. వ్యవసాయానికి 24గంటలపాటు ఉచిత, నాణ్యమైన విద్యు త్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర మే. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కోసం తొమ్మిదేండ్లలో సుమారు రూ. 75వేల కోట్లు ఖర్చు చేసింది. ఉచిత విద్యుత్తు సబ్సిడీ కోసం 2014 నుంచి ఇప్పటి వర కు రూ. 36,889 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించింది. ఇది కాకుండా రూ. 38వేల కోట్ల తో విద్యు త్తు ఆధునికీకరణ పనులు చేపట్టింది. ఉచిత విద్యుత్తు కోసం ప్రభుత్వం ప్రతిఏటా రూ. 10వేల కోట్లకు పైగా వెచ్చించింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు లాఠీదెబ్బలు తినాల్సి వచ్చేది. నాటి సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతో సీజన్‌కు ముందే రైతులకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచేవారు. 2014లో 25.14 లక్షల టన్నుల ఎరువులు వినియోగించగా 2022లో ఇది 39.87 లక్షలకు పెరిగింది.
అసంఘటితంగా ఉన్న రైతులను ఏకం చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం రైతువేదికలను నిర్మించింది. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్‌కు ఒకటి చొప్పున రూ. 572 కోట్లతో 2,601 రైతు వేదికల్ని నిర్మించింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గోదాముల నిల్వ సామర్థ్యాన్ని కేసీఆర్ సర్కారు రెట్టింపు చేసింది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో 39 లక్షల టన్నుల సామర్థ్యం గల సుమారు 700 గోదాములు ఉండేవి. కొత్తగా మరో 800 గోదాములు నిర్మించి సామర్థ్యాన్ని 74 లక్షల టన్నులకు పెంచింది.
నాటి సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు అమలు చేసిన వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలు రాష్ట్రంలో పసిడి పంటలు పండించాయి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు అంతంత మాత్రంగా ఉండే పంటల ఉత్పత్తులు పదేండ్ల కాలంలో భారీగా పెరిగాయి. ఎంతలా అంటే ఎవరూ ఊహించని విధంగా 185 శాతం పంటల ఉత్పత్తి పెరగడం గమనార్హం. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఆహార పంటల ఉత్పత్తి 2014-15లో 71.14 లక్షల టన్నులు కాగా 2022-23లో ఇది 202.76 లక్షల టన్నులకు పెరిగినట్టు వెల్లడించింది. అంటే తొమ్మిదేండ్ల కాలంలో 131 టన్నులు అధికంగా ఉత్పత్తి పెరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం పంటల ఉత్పత్తి 346.43 కోట్ల టన్నులకు పెరిగింది.
పెరిగింది 131.62 లక్షల టన్నులు185 శాతం పెరుగుదల
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో నిత్యం రైతు ఆత్మహత్య వార్తలు కనిపించేవి. ఓవైపు కరువు కాటకాలు, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఇంకో వైపు అప్పులు వెరసి రైతులకు పురుగుల అన్నమే పెరుగున్నమయ్యేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ చర్యలతో వ్యవసాయం గాడిన పడటంతో రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయి. గడిచిన తొమ్మిదేండ్లలో 84 శాతం రైతు ఆత్మహత్యలు తగ్గినట్టు ఎన్సీఆర్బీ వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం 2014లో 1,347 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే 2023లో ఇది 215కు తగ్గింది.
ఉమ్మడి రాష్ట్రంలో గాడితప్పిన వ్యవసాయాన్ని మాజీ సీఎం కేసీఆర్ అనేక వ్యయప్రయాసలకోర్చి దారిలోకి తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే ఆగం చేస్తున్నది. మళ్లీ మునుపటి రోజులను తీసుకొస్తున్నది. ఇప్పటికే కాళేశ్వరంపై కక్షగట్టి సాగు నీళ్లు రాకుండా చేస్తున్నది, పెట్టుబడి సాయం రైతుబంధుకు ఎగనామం పెట్టింది. కొతలు, కొర్రీలతో అరకొర రుణమాఫీ చేసి రైతులకిచ్చిన హామీని తుంగలో తొక్కింది. ఎరువుల కోసం మళ్లీ క్యూ లైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి
ఏర్పడింది.
పెట్టుబడి సాయం అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఆరేండ్లపాటు రైతుబంధు పథకాన్ని నిర్విఘ్నంగా కొనసాగించగా కాం గ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఈ పథకానికి రాంరాం పలికింది. ఈ ఏడాది వానకాలం సీజన్ రైతుభరోసాను ఎగ్గొట్టేసిం ది. తద్వారా రైతులకు రూ. 11వేల కోట్లు బాకీ పడింది. యాసంగి రైతుభరోసా ఎప్పు డు ఇస్తుందో, అసలు ఇస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇచ్చినా అడ్డగోలుగా కోతలు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టుగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. పంట వేసిన భూమికే పెట్టుబడి సాయం అందిస్తామని ఇప్పటికే సీఎం, మంత్రులు ప్రకటించారు. రైతుభరోసా కింద రూ. 15వేలు ఇస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ ఇప్పటికే ఉన్న రైతుబంధు ఇవ్వలేదు.
అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న ప్రతి రైతుకు రూ. 2లక్షల పంట రు ణాలను మాఫీ చేస్తామని హామీ ఇ చ్చింది. తీరా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత అరకొరగా రుణమాఫీ చేసి చేతులు దులిపేసుకున్నది. ప్రభు త్వ లెక్కల ప్రకారం 42 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయడానికి రూ. 31వేల కో ట్లు అవసరం అవుతాయని పేర్కొంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం 25.35 లక్షల మంది రైతులకు రూ. 20,616 కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేసింది. ఇంకా 16.6 5 లక్షల మంది రైతులకు రూ. 10,38 4 కోట్లు మాఫీ చేయాల్సి ఉంది. కానీ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల రు ణమాఫీ పూర్తయినట్టు ప్రకటించారు.
ఎరువులు, విత్తనాల కోసం గడిచిన ఎనిమిదేళ్లుగా కనిపించని రైతుల చెప్పుల క్యూలు మ ళ్లీ దర్శనిమిస్తున్నాయి. మొన్న టి వానకాలం సీజన్లో యూరి యా దొరకక రైతులు ఇబ్బంది పడ్డారు. పత్తి విత్తనాలు లభించక రోడ్డెక్కిన పరిస్థితులు వచ్చా యి. కనీసం జనుము, జీలుగ విత్తనాలను కూడా రైతులకు సరఫరా చేయలేకపోయింది. ఒకే సీజన్లో యూరియా, పత్తి విత్తనాలు, జీలుగ విత్తనాల కొరతతో రైతులు ఆగమయ్యారు. రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిందే ఆలస్యం అన్నట్టుగా మళ్లీ రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి. గత 11 నెలల్లో 347 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రతిపక్ష బీఆర్ఎస్, రైతుల సంఘాలు చెప్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ కరెంట్ కోతలు మొదలయ్యా యి. గత యాసంగిలో వ్యవసాయం ఆగమైంది. రాత్రిపూట సరఫరాతో పలువురు రైతులు విద్యుత్ షాక్‌తో చనిపోయారు. సాగునీరు లేక ఉమ్మడి నల్లగొండలో అనధికార క్రాప్ హాలిడే ప్రకటించారు. ఎనిమిదేండ్ల తర్వాత ఎండిన పంటలు దర్శనమిచ్చాయి.
కాంగ్రెస్ హయాంలో రైతులు పంటలను అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు పెడుతుండడంతో ధాన్యం, పత్తి రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ సీజన్లో 91 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు కేవలం 40 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు.
ఒకప్పుడు బుక్కెడు బువ్వ కోసం ఎదురు చూసిన తెలంగాణ రైతాంగం.. ఇప్పుడు దేశానికే అన్నపూర్ణగా మారింది. కేసీఆర్ అమలు చేసిన ఉచిత విద్యుత్తు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు వంటి పథకాలతో రాష్ట్రంలో వరిసాగు, ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగింది. ఆర్బీఐ లెక్కల ప్రకారం రాష్ట్రంలో వరిసాగు 2014-15తో పోల్చితే 231శాతం పెరగ్గా, ధాన్యం ఉత్పత్తి 280 శాతం పెరిగినట్టు వెల్లడించింది. 2014-15లో వరి సాగు 34.96 లక్షల ఎకరాలు కాగా, 2023-24లో 115.76 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇందుకు అనుగుణంగానే ధాన్యం ఉత్పత్తి 44.40 లక్షల టన్నుల నుంచి 168.74 లక్షల టన్నులకు పెరిగింది.
ఈ విధంగా వరిసాగు 80 లక్షల ఎకరాలు పెరగ్గా ధాన్యం ఉత్పత్తి 124.34 లక్షల టన్నులు పెరిగినట్టు వెల్లడించింది. ఇదిలా ఉంటే ఆర్బీఐ లెక్కలతో పోల్చితే రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం వరిసాగు, ధాన్యం ఉత్పత్తి భారీగా పెరగడం గమనార్హం. 2014-15లో వరిసాగు 34.97 లక్షల ఎకరాలు కాగా ధాన్యం ఉత్పత్తి 76.93 లక్షల టన్నులుగా ఉండేది. 2022-23 నాటికి వరిసాగు 121 లక్షల ఎకరాలకు పెరగ్గా, ధాన్యం ఉత్పత్తి 266.20 లక్షల టన్నులకు పెరిగింది. ఈ లెక్కన రాష్ట్రంలో వరిసాగు 86.03 లక్షల ఎకరాలు పెరగ్గా, ధాన్యం ఉత్పత్తి ఉత్పత్తి 189.27 లక్షల టన్నులు పెరిగింది.
కేసీఆర్ ప్రభుత్వం రైతులు పంటలు పండించేందుకు సాయం చేయడంతో పాటు పండించిన పంటలను కొనుగోలు చేయడంలోనూ ముందుంది. ఇందులో భాగంగానే ప్రతి సీజన్లో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసింది. అది కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరీ కొనుగోలు చేసింది. ఈ విధంగా తొమ్మిదేండ్లలో రైతుల నుంచి రూ. 1.34 లక్షల కోట్ల విలువైన 736.99 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ విధంగా రాష్ట్రంలో గడిచిన తొమ్మిదేండ్లలో ధాన్యం కొనుగోళ్లు 438.65 శాతం పెరిగాయి. 2014-15లో కేవలం 24.29 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగా 2022-23లో ఇది 130.84 లక్షల టన్నులకు పెరిగింది.
ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా మాజీ సీఎం కేసీఆర్ రైతులకు తొలిసారిగా పెట్టుబడి సాయం చేయాలనే ఆలోచన చేశారు. ఇందులో భాగంగానే రైతుబంధు పథకాన్ని అమలు చేశారు. సాగుకు ముందే రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, ఇతర ఖర్చుల కోసం ప్రతి ఎకరాకు ఏటా రూ. 10వేలు ఇవ్వాలని నిర్ణయించారు. కేసీఆర్ ఆలోచన తెలంగాణ వ్యవసాయరంగంలో పెను విప్లవంగా మారింది. రైతుల గోస తీర్చడమే కాదు, ఈ రంగం రూపురేఖల్నే మార్చేసింది. ఆరేండ్లలో 11 విడతల్లో ఏకంగా రూ. 72,808 కోట్లను పెట్టుబడి సాయంగా రైతులకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఇందుకోసం ప్రతిఏటా రూ. 15వేల కోట్లు కేటాయించేవారు.
పెరిగింది 124.34 లక్షల టన్నులు
సాగు విస్తీర్ణం 231 శాతం పెరిగింది. ఉత్పత్తి 280 శాతం పెరిగింది.