మంచిర్యాలటౌన్, అక్టోబర్ 7 : బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్ర హం వద్ద జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కండ్లకు నల్లవస్ర్తాలు కట్టుకుని నిరసన వ్యక్తంచేశారు. బీసీ ఐక్య హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. దేశ జనాభాలో 60% బీసీలుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలు కేవలం 15% మంది, రాష్ట్ర జనాభాలో బీసీలో 56% మంది ఉంటే ఉద్యోగులు కేవలం 9% మాత్ర మే ఉన్నారని వెల్లడించారు. మండల్ కమిటీ సిఫారసుల ప్రకారం రిజర్వేషన్లు లేవన్నారు.
మల్లాపూర్, అక్టోబర్ 7 : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామ సర్పంచ్ స్థానం ఈసారి ఎస్సీ జనరల్‌కు కేటాయిం చారు. కారోబార్‌గా పనిచేస్తున్న అండెం రాజేశ్‌కు రిజర్వేషన్ అనుకూలించడంతో సర్పంచ్‌గా పోటీ చేయబోతున్నట్టు గ్రామంలో ప్రచారం చే సుకున్నాడు. మూడురోజుల క్రితం తన తోట వద్ద పని నిమిత్తం వెళ్లి బైక్‌ను రోడ్డు పక్కనే నిలిపాడు.
సదరు బైక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కొద్ది దూరం తీసుకెళ్లి బండరాళ్లతో ధ్వంసం చేశారు. ‘ఇప్పుడు బండి.. తర్వాత నువ్వే.. నువ్వు నిలబడురా’ అంటూ బెదిరిస్తూ కాగితంపై రాసి రాజేశ్‌కు తెలిసేలా అక్కడ పెట్టి వెళ్లా రు. కొద్దిసేపటి తర్వాత రాజేశ్ బైక్ కోసం గా లించగా, కొద్ది దూరంలో ధ్వంసమై కనిపించింది. దాని పక్కనే హెచ్చరిక నోట్ ఉన్నట్టు బాధితుడు తెలిపాడు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై తీసుకోవాలని మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.