హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావుకు రాష్ట్ర పద్మశాలి సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌ను మాసబ్‌ట్యాంక్‌లోని డీఎస్ఎస్ భవన్లో సంఘం నేతలు శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. సంఘం అధ్యక్షుడు వలకటి రాజకుమార్, నేతలు గుంటి నగేశ్, గంజి శ్రీనివాస్, మేకల జయరాములు, బింగి నవీన్‌కుమార్, మామిడాల సంపత్, మేకల నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
9 మంది అదనపు కమాండెంట్ల బదిలీ
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు బెటాలియన్లలో అదనపు కమాండెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్న తొమ్మిది మందిని బదిలీ చేస్తూ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే బదిలీ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. 17వ బెటాలియన్‌కు చెందిన అడిషనల్ కమాండెంట్ ఎస్ శ్రీనివాసరావు 3వ బెటాలియన్‌కు బదిలీ అయ్యారు. ఇబ్రహీంపట్నానికి చెందిన టీ గంగారామ్‌ను 17వ బెటాలియన్‌కు, 10వ బెటాలియన్‌కు చెందిన కే సుబ్రహ్మణ్యంను 5వ బెటాలియన్‌కు, 5వ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎన్ పెద్దబాబును 2వ బెటాలియిన్కు, 8వ బెటాలియన్‌కు చెందిన కే వీరయ్యను 12వ బెటాలియన్‌కు, 12వ బెటాలియన్‌కు చెందిన ఎం జయరాజును 10వ బెటాలియన్‌కు, 15వ బెటాలియన్‌కు చెందిన పీ వెంకట రాములును 13వ బెటాలియన్‌కు, 3వ బెటాలియన్‌కు చెందిన ఎం ఐ సురేశ్‌ను 4వ బెటాలియన్‌కు, 7వ బెటాలియన్‌కు చెందిన పీ సత్యనారాయణకు డిచ్పల్లి బెటాలియన్ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.