మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ సొరంగంలో (SLBC Tunnel) చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ కనుగొనేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతంలో నీళ్లు ఉబికి వస్తుండటంత, బురద ఎక్కువగా ఉండట, విద్యుత్ లేకపోవడం వంటి సమస్యలతో రెస్క్యూ టీమ్‌కు అక్కడి పరిస్థితులు అడ్డంకిగా మారాయి. పైభాగంలో పెద్ద ఎత్తున జలరాశి ఉన్నదని, పై నుంచి సొరంగంలోకి వెళ్లే అవకాశం ఏమాత్రం లేదని, అక్కడ ముట్టుకుంటే కూలిపోయే ప్రమాదం ఉన్నదంటూ నేషనల్ జియోగ్రాఫిక్ సర్వే ఏజెన్సీ నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టన్నెల్ వద్ద ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
కాగా, సహాయక చర్యల్లో భాగంగా ఐదో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. టన్నెల్లో ప్రధాన అడ్డంకిగా ఉన్న చివరి 40 మీటర్ల ప్రదేశాన్ని కూడా సహాయక బృందాలు దాటాయి. సొరంగంలో సుమారు 7 నుంచి 9 మీటర్ల ఎత్తున మట్టి నిండిపోయింది. పూడిపోయిన మట్టి తీస్తే తప్ప టన్నెల్ బోరింగ్ మిషన్ (TBM) ముందుభాగానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అయితే పైభాగంలో పెద్ద ఎత్తున జలరాశి ఉన్నదని, పై నుంచి సొరంగంలోకి వెళ్లే అవకాశం ఏమాత్రం లేదని, అక్కడ ముట్టుకుంటే కూలిపోయే ప్రమాదం ఉన్నదంటూ నేషనల్ జియోగ్రాఫిక్ సర్వే ఏజెన్సీ నివేదిక ఇచ్చింది. మరోవైపు సొరంగంలో లైనింగ్ లేని చోట డ్రిల్లింగ్ చేసిన ప్రదేశం కూడా ఏ క్షణమైనా మళ్లీ కూలవచ్చని అంచనా వేస్తున్నారు.
Slbc 1
మంగళవారం రాత్రి తమ ప్రాణాలు లెక్క చేయకుండా సొరంగంలో చిక్కుకున్న బాధితులని తీయడానికి వెళ్లిన ర్యాట్ మైన్స్ బృందం