హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో గణతంత్ర వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మహమూద్ అలీ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ నేతలు తుల ఉమ, సుమిత్రా ఆనంద్, సుశీలారెడ్డి, దాసోజు శ్రవణ్, దేవీప్రసాద్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, తుంగ బాలు, కిశోర్‌గౌడ్, బొమ్మెర రామ్మూర్తి, ఫయాజ్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, భవన్ ఇన్చార్జి నాయినేని రాజేశ్రావు, పర్యాద కృష్ణమూర్తి, గాంధీనాయక్ తదితరులు పాల్గొన్నారు.