హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురసరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ప్రగతిభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ చిత్రపటాలకు సీఎం కేసీఆర్ పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, నవీన్‌రావు, శంభీపూర్ రాజు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమా ర్, పలువురు ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అమర జవానులకు సీఎం శ్రద్ధాంజలి
ప్రగతిభవన్‌లో జాతీయ పతాకావిషరణ అనంతరం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో అమర జవానుల స్మారక స్థూపం వద్దకు వెళ్లి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశం కోసం అమర జవానుల త్యాగాలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకున్నారు.