హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ముందుగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ-ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యేక నాటికను ప్రదర్శిస్తున్నారు.
రాజ్యాంగ ఉల్లంఘనలను ఎండగడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పేలా నిర్వహిస్తున్న నాటికను కేటీఆర్‌తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు వీక్షిస్తున్నారు.
తెలంగాణ భవన్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు pic.twitter.com/qLXwOfJxlq
— Telugu Scribe (@TeluguScribe) January 26, 2026