హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లాలో దళిత యువకుడు కర్ల రాజేశ్ లాకప్ డెత్‌పై విచారణ చేపట్టి, 8 వారాల్లోగా రిపోర్టు సమర్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర డీజీపీతోపాటు సూర్యాపేట కలెక్టర్, ఎస్పీకి శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. పోలీస్ కస్టడీలో రాజేశ్ మరణానికి దారితీసిన పరిస్థితులు, తెలంగాణలో మానవ హకుల పరిరక్షణకు చేపట్టిన చ ర్యల వివరాలను నివేదికలో పొందుపరచాలని స్పష్టం చేసింది. రాజేశ్ లాకప్ డెత్‌పై ఢిల్లీ వర్సిటీ న్యాయశాస్త్ర విద్యార్థి కల్యాణ్ చేసిన ఫిర్యాదును ఎన్హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించి ఆదేశాలు జారీచేసింది