హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): గురుకులంలో ఫుడ్‌పాయిజన్ ఘటనపై రాష్ట్ర బీసీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కరీంనగర్‌లోని శర్మనగర్ జ్యోతిబాఫూలే బీసీ హాస్టల్లో ఫుడ్‌పాయిజన్ జరిగి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై మీడియాలో కథనాలు రావడంతో బీసీ కమిషన్ స్పందించింది. మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్‌ను బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదేశించారు.
ఆత్మహత్యలకు పాల్పడవద్దు ; హక్కులను పోరాడి సాధించుకుందాం: దేవీప్రసాద్
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, హక్కులు, బెనిఫిట్స్‌ను పోరాడి సాధించుకుందామని ఉద్యోగ సంఘాల జాక్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ సూచించారు. దాదాపు 8,000 మంది ఉద్యోగులకు రావలసిన పెన్షన్ బెనిఫిట్స్ అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్టు మహబూబ్‌నగర్ జిల్లా రిటైర్డ్ ఏఆర్ ఎస్సై ఎండీ సాదిక్ చెప్పడం అందరినీ తీవ్రంగా కలచివేసిందని వెల్లడించారు. సమస్యలను పరిష్కరించుకుందామని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరా రు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగుల సమస్యలు పరిషరించాలని దేవీప్రసాద్ డిమాండ్ చేశారు.