హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తేతెలంగాణ):రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శిగా రేండ్ల తిరుపతి బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం శాసనసభ కార్యదర్శి చాంబర్లో ప్రస్తుత కార్యదర్శి నరసింహాచార్యులు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. నరసింహాచార్యులు మండలి కార్యదర్శిగా కొనసాగనున్నారు.