హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని ముస్లిం జంగ్ బ్రిడ్జి వద్ద పశువైద్యశాల, గోశాలను నిర్వహిస్తున్న ట్రస్టు స్థలంలో ఆక్రమణలను 2 వారాల్లోగా తొలగించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఆక్రమణల తొలగింపునకు అవసరమైన భద్రత కల్పించాలని పోలీస్ కమిషనర్‌కు స్పష్టం చేసింది.
ఈ మేరకు జస్టిస్ సుద్దాల చలపతిరావు మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు.