కామారెడ్డి, సెప్టెంబర్ 22: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడికి కుట్లు వేసినందుకు ఫీజు చెల్లించకపోవడంతో.. వేసిన కుట్లను తొలగించారు ఓ ప్రైవేట్ దవాఖాన సిబ్బంది. ఈ అమానవీయ ఘటన కామారెడ్డి కేంద్రంలో ఆదివారం చోటుచేసున్నది. పట్టణానికి చెందిన శ్రీను అనే యువకుడు బైక్ అదుపుతప్పి కిందపడి గాయాలపాలయ్యాడు. రక్తస్రావం కావడంతో స్థానిక ప్రైవేట్ దవాఖానకు వెళ్లి, డాక్టర్ (కన్సల్టేషన్) ఫీజు రూ. 300 చెల్లించి చూపించుకున్నాడు. ప్రమాదంలో తగిలిన గాయాలకు దవాఖాన సిబ్బంది కుట్లు వేశారు. అయితే కుట్ల వేసినందున డబ్బులు అడిగారు. తన వద్ద నగదు లేకపోవడంతో క్రెడెట్ కార్డు ద్వారా ఫీజు తీసుకోవాలని చెప్పడంతో దవాఖాన సిబ్బంది నిరాకరించారు. అంతటితో ఆగకుండా సిబ్బంది యువకుడితోపాటు వెంట ఉన్న స్నేహితులపై దాడికి పాల్పడ్డారు. దీంతో యువకుడి బంధువులు దవాఖాన వద్ద ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. చివరికి దవాఖాన సిబ్బంది యువకుడికి వేసిన కుట్లను విప్పేసి పంపించి వారిలోని పైశాచికత్వాన్ని చాటుకున్నారు. అనంతరం సదరు యువకుడిని స్నేహితులు ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హక్కుల సాధన, సమస్యల పరిష్కా రానికి ఏర్పడిన తెలంగాణ ఎంప్లా యిస్ జేఏసీలో 205 సంఘాలు భాగ స్వామ్యమయ్యాయి. ఉమ్మడి ఏపీలో 117 సంఘాలు ఉండగా, తాజాగా 205 సంఘాలు తెలంగాణ ఎంప్లా యిస్ జేఏసీలో చేరినట్టు తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. ఎంప్లాయిస్ జేఏసీ కార్యవర్గ సమా వేశాన్ని 24న బాగ్లింగంపల్లిలోని సుందయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వ హించనున్నట్టు తెలిపారు. సమావేశం అనంతరం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సన్మాన సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. మంగళవారమే జేఏసీ పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటుచేస్తామని, అనంతరం జిల్లా జేఏసీలు ఏర్పాటవుతాయని తెలిపారు.