హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ‘ధరణి’ పోర్టల్‌తో మధ్యవర్తులు లబ్ధి పొందకుండా 4 వారాల్లోగా చర్యలు చేపడతామని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) నవీన్ మిట్టల్ హైకోర్టుకు తెలిపారు. ధర్మాసనం ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. ధరణి పోర్టల్‌లో వివిధ సమస్యలు తలెత్తుతున్నాయంటూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం విచారణ జరిపారు. ఫిర్యాదుల పరిషారానికి 4 వారాల సమయం కావాలని కమిషనర్ కోరారు. హైకోర్టు.. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది.