ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 15, 2020 , 21:30:53

రచయిత గూడ అంజయ్య మననం

రచయిత గూడ అంజయ్య మననం

జననం: 1955

మరణం: 21 జూన్‌ 2016

ఆదిలాబాద్‌ జిల్లా దండేపల్లి మండలం, లింగాపురం గ్రామంలో లక్ష్మమ్మ, లక్ష్మయ్య దంపతులకు  1955లో అంజయ్య జన్మించారు. 2016 జూన్‌ 21న మరణించారు.వృత్తిరీత్యా హైదరాబాద్‌కు పయనమయ్యారు. హైదరాబాద్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేశారు. స్పందించే తత్వమున్న అంజయ్య సాహిత్యంపై ఆసక్తితో కలం  కదిలించారు. ప్రజాకవుల్లో గూడ అంజయ్యది ప్రత్యేక స్థానం. నాలుగు దశాబ్దాలుగా కవి, రచయితగా ఎన్నో పాటలు, కథలు రాశారు.

గ్రామీణ నేపథ్యమున్న అంజయ్య తన సాహిత్యంలో పల్లెగోసల్ని కండ్లకు కట్టారు. ఆయన రాసిన ‘ఊరుమనదిరా ఈ వాడ మనదిరా’ పాట 16 భాషల్లో అనువాదమైంది. తెలంగాణ ఉద్యమంలో సైతం కీలకపాత్ర పోషించారు. ఆయన రాసిన నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు, జర భద్రం కొడుకో కొడుకో కొమురన్న, అయ్యోనివా నువ్వు అవ్వోనివా, రాజిగ ఓరి రాజిగా, ఇగ ఎగబడుదాంరో ఎములాడ రాజన్న, లచ్చులో లచ్చన్న,  గజ్జలు గజ్జాలు రెండు గజ్జలోరాజన్న, తెలంగాణ గట్టుమీద సందమామయ్యో పాటలు బాగా ప్రాచూర్యం పొందాయి. 2016లో రంగారెడ్డి జిల్లా రాగన్నగూడలో మూత్రపిండాల వ్యాధితో చనిపోయారు.


logo