హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు మరోసారి ఊరట లభించింది. ఆయనను అరెస్టు చేయరాదని గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. వాదనలు వినిపించేందుకు గడువు కావాలని ప్రభుత్వం కోరడంతో తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేసింది. అప్పటి వరకు హరీశ్‌రావును అరెస్టు చేయవద్దని పంజాగుట్ట పోలీసులకు స్పష్టం చేసింది.