హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రిటైరైన ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాలు, దాచుకున్న సొమ్ము వంటి బెనిఫిట్లను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. బెనిఫిట్స్ రాకపోవడం వల్ల చాలా మంది పెన్షనర్లు మానసిక క్షోభకు గురవుతూ, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని చెప్పారు. ప్రతి నెలా రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. వాటిని ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఉద్యోగ విరమణ చేసే వారికి ఎప్పటికప్పుడు బెనిఫిట్స్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు సర్కారు కొత్త పోస్టులను మంజూరు చేసింది. 36 డాటా ఎంట్రీ ఆపరేటర్లు, 36 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను కేటాయించింది. ఈ పోస్టులకు అర్హులైన వారిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ చేసుకోవాలని ఇంటర్ విద్యా డైరెక్టర్ కృష్ణ ఆదిత్య సూచించారు.