నాగార్జునసాగర్ ఉప్పొంగుతున్నది. బుధవారం శ్రీశైలం జలాశయం నుంచి 2,95,652 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో 18 క్రస్ట్ గేట్లను ఎత్తి 2,49,732 క్యూసెక్కుల నీటిని స్పిల్‌వే మీదుగా దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు 584.50 అడుగుల నీటిని నిల్వ చేస్తూ శ్రీశైలం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను అదేస్థాయిలో విడుదల చేస్తున్నారు.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుసాపురం వద్ద ఉన్న లక్నవరం సరస్సు నిండుకుండలా మారింది. దీంతో చూపరులను ఆకర్షిస్తున్నది. లక్నవరం సరస్సును సందర్శించేందుకు చిన్నాపెద్ద అనే తేడా లేకుండా పర్యాటకులు పోటెత్తారు.