హైదరాబాద్, అక్టోబర్ 14(నమస్తేతెలంగాణ) : గ్రూప్-1 మెయిన్స్ హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు టీజీపీఎస్సీ రిజిస్ట్రేషన్ ఐడీ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్‌టికెట్లను పొందవచ్చని వెల్లడించింది. ఈ నెల 21 నుంచి 27 వరకు జరుగనున్న మెయిన్స్‌కు 31,382 మంది హాజరుకానున్నారు.