మహబూబ్‌నగర్ విద్యావిభాగం, సెప్టెంబర్ 18: ప్రభుత్వ పాఠశాలలకు మొదటి విడత నిర్వహణ నిధులను సర్కారు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 26,387 స్కూల్స్కుగానూ రూ.48.86 కోట్లు బుధవారం రిలీజ్ అయ్యాయి. ఈ నిధులను వసతుల కల్పన, క్రీడలకు వినియోగించనున్నారు. బడులు తెరుచుకొని మూడు నెలలైనా నిధులు లేవంటూ 18వ తేదీన (బుధవారం) ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన ‘చాక్‌పీస్‌లకు డబ్బుల్లేవ్.!’ కథనానికి ప్రభుత్వం స్పందించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్య, సామాజిక వర్గం ప్రాతిపదికన గ్రాంట్లు కేటాయించింది. ఉపాధ్యాయుల ఇబ్బందులను వెలుగులోకి తీసుకురావడంతోపాటు నిధులు విడుదలకు కృషి చేసిన ‘నమస్తేతెలంగాణ’కు ఉపాధ్యాయ లోకం కృతజ్ఞతలు తెలిపింది.
పొలాల వద్ద ట్రాన్స్ఫార్మర్ బిగింపు
చిల్పూరు, సెప్టెంబర్ 18: జనగామ జిల్లా చిల్పూరు మండలం కొండాపూర్‌లో విద్యుత్తు సిబ్బంది ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతు చేసి బిగించారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘కరెంట్ లేక ఎండుతున్న పొలాలు’ కథనానికి విద్యుత్తు అధికారులు స్పందించారు. 40 ఎకరాల్లో వరి, 15 ఎకరాల్లో మక పంట ఎండిపోయిందని రైతులు ఆందోళన చెందగా నమస్తే తెలంగాణ వెలుగులోకి తేగా, వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ గడ్డం గణేశ్, ఏడీ వంశీకృష్ణ, ఏఈ రమేశ్, సబ్‌ఇంజినీర్ వినీత్‌రెడ్డి, లైన్ఇన్స్పెక్టర్లు యాదగిరి, చంద్రశేఖర్, రైతులు వెలిశాల రవీందర్, మారబోయిన యాదగిరి, చొక్కం రాజు, వెలిశాల రాజయ్య, కూరపాటి రమేశ్, కుంచం రాజు, వెలిశాల అనిల్, చొక్కం మల్లేశ్, జోడుముంతల బుచ్చిరాములు, మారబోయిన సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.