హైదరాబాద్, సెప్టెంబర్25 (నమస్తే తెలంగాణ): దళితబంధు నిధులను ప్రభుత్వం వెంట నే విడుదల చేయాలని దళితబంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోగిల మహేశ్, రాష్ట్ర కన్వీనర్ చిట్టి మల్ల సమ్మయ్య డిమాండ్ చేశా రు. సచివాలయంలో బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. రెండో విడత దళిత బంధు నిధులు విడుదలైనా కలెక్టర్ల అకౌంట్లలోనే ఉన్నాయని వెల్లడించారు. నిధుల విడుదలకు 9 నెలలుగా అనేక కార్యక్రమాలు చేపట్టి నా ఎలాంటి స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా నిధుల విడుదలకు చొరవ చూపాలని పొన్నంను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కో ఆర్డినేటర్ మడికొండ రమేశ్, ఉపాధ్యక్షుడు బోనగిరి శ్రీనివాస్, సలహాదారులు దర్శనాల సంజీవ, కావేరి చిన్నికృ ష్ణ, బాల నర్సు, కమిటీ నేతలు కొలుగూరి సురే శ్, నరేశ్, భిక్షపతి, కుమార్, శ్రీనివాస్, రాజేశ్, మధు, దేవదాసు, రజనీకాంత్ ఉన్నారు.
విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలల స్థాయిలోనే ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేలా కరికులం ఉండేలా చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో రోడ్డు-భద్రత, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రవాణా శాఖ ఆదాయం పెంచడానికి తీసుకోవల్సిన చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గతంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన సూచనలపై చర్చించారు. సూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై విషయంలో కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఆటోలలో విద్యార్థులను ఓవర్ లోడ్‌తో తీసుకెళ్తున్న వారిపై తనిఖీలు నిర్వహించాలని సూచించారు. తెలంగాణలో ప్రతి రోజూ 20 మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని నివారించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.