హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్ రెండు రోజులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. 11,12న హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్‌లోని డీఎస్ఎస్ భవన్లో డెడికేషన్ కమిషన్ ఛైర్మన్ బుసాని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ విచారణ చేపట్టనున్నారు.
11న ప్రజలందరికీ అవకాశం కల్పించగా, 12న ఎన్జీవోలు, కుల సంఘాలు, ఇతర సంస్థలను విచారిస్తారు.
కులగణన బహిష్కరిస్తున్నాం
కామారెడ్డి రూరల్, నవంబర్ 9: లబా నా లంబాడా కులాన్ని బీసీల్లో చేర్చక పో వడాన్ని నిరసిస్తూ కుల గణనను బహిష్కరిస్తున్నట్టు లబానా లంబాడ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు తాన్సింగ్ నాయక్ తెలిపారు. శనివారం ఆయన కామారెడ్డిలో మీడియా తో మాట్లాడారు. తెలంగాణలోని తొమ్మిది నియోజక వర్గాల్లో 2 లక్షల మందికిపైగా లబానా లంబాడాలు ఉన్నారని, తామం తా కుల గణనకు దూరంగా ఉంటామని చెప్పారు. లబానా లంబాడాలకు భాష, బీ సీ కుల జాబితాలో గుర్తింపు ఇచ్చిన తర్వా తే గణన చేపట్టాలని డిమాండ్ చేశారు.