మహదేవపూర్, ఆగస్టు 23: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్‌కు(Medigadda Barrage) ప్రవాహం తగ్గుతూ(Reduced flood )వస్తోంది. శుక్రవారం 1,40,310 క్యూసెక్కులు రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువ కు విడుదల చేస్తున్నారు. బరాజ్ రివర్ బెడ్ నుంచి సముద్ర మట్టానికి 88 మీటర్లు కాగా, ప్రస్తుతం వరద ప్రవాహం సముద్ర మట్టానికి 91.60 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది.