హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యు త్ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన ఉత్త బోగస్ అని, సోలార్ విద్యుత్తుకు ప్రభు త్వం నిధులు విడుదల చేయాలని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సూళ్లకు ‘మన ఊరు-మన బడి’లో భాగంగా సోలార్ విద్యుత్తు అందించాలని నిర్ణయించిందని తెలిపారు. మొదటి విడత 11 జిల్లాల్లో 1,521 బడుల్లో సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
రెండో విడతలో మరో 5,267 సూళ్లల్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందని, అందుకు రూ.283 కోట్ల ఖర్చు అవుతుందని ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసిందని పేర్కొన్నారు. ఆ ప్రతిపాదిత మొత్తాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.