హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): అధికారమే పరమావధిగా రేవంత్‌రెడ్డి దిగజారి వ్యవహరిస్తున్నాడని రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి విమర్శించారు. కన్న తల్లిని బూతులు తిట్టిన మైనంపల్లి హనుమంతరావును కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు రేవంత్ ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. ఇటీవల ఒక ఆడియోలో రేవంత్, అతని తల్లి గురించి మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను సతీశ్‌రెడ్డి ఖండించారు.
స్వయంగా మైనంపల్లికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధపడ్డారని రేవంత్ తీరును దుయ్యబట్టారు. రేవంత్ లాంటి వ్యక్తులకు ఇది ఒక దందాలాంటిదని, అందుకోసం కన్నతల్లి గౌరవాన్ని పణంగా పెట్టిన దుర్మార్గుడు అని మండిపడ్డారు. కన్నతల్లి అంటేనే పట్టింపు లేనివాడికి రాష్ట్ర ప్రజలు అంటే పట్టింపు ఎలా ఉంటుందని ప్రశ్నించారు.