హైదరాబాద్, జూన్ 22 :తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (తెలంగాణ స్టేట్ రినెవెబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్) చైర్మన్గా నియమితులైన యెరువు సతీశ్ రెడ్డి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆశిస్సులను తీసుకున్నారు. తన మీద నమ్మకంతో పదవి అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.సీఎం ఇచ్చిన బాద్యతలను త్రికరణ శుద్ధితో నిర్వహిస్తానని సతీశ్ రెడ్డి తెలిపారు.
అనంతరం ఆయన, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డిలతో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని మంత్రుల నివాసంలో కలిశారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి సతీశ్ రెడ్డిని శాలువాతో సత్కరించారు.