Weather | హైదరాబాద్ : పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ నెల 23న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ జారీ చేసింది. ఈ నెల 24, 25 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు, ఉమ్మడి నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ, రేపు, ఎల్లుండి వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని సూచించింది. రేపట్నుంచి 3 రోజుల పాటు 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.