శంషాబాద్ రూరల్, జనవరి 23: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు నిఘా వర్గాలు రెడ్అలర్ట్ ప్రకటించాయి. ఈ నెల 30 వరకు ఎయిర్పోర్టులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రయాణికులతోపాటు ఇతర వ్యక్తులెవరైనా ఎయిర్పోర్టుకు వస్తే పూర్తిస్థాయిలో తనిఖీ చేసి అనంతరమే అనుమతి ఇస్తున్నారు.30వ తేదీ వరకు సందర్శకులకు అనుమతి లేదని ఎయిర్పోర్టు అధికారులు ప్రకటించారు.