పెద్దపల్లి : తెల్ల బంగారంగా పిలవబడే పత్తికి మార్కెట్లో అత్యధిక ధర పలుకుతుంది. ముఖ్యంగా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో మున్నెన్నడూ లేనివిధంగా శుక్రవారం అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 8,410 ధర పలకడం విశేషం . గురువారం ఇదే మార్కెట్లో క్వింటాల్ ధర 8,300 రాగా ఈరోజు మరో రూ. 110 అధనంగా ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.