హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 25 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ముత్తూయాదవ్పై సస్పెన్షన్ వేటు పడింది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సు మంత్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ప్రభుత్వ సూచనల మేరకు ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకుంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎఫ్ఐఆర్ న మోదులో అలసత్వంతోపాటు సుమంత్‌ను ప ట్టుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకు సీఎం కార్యాలయం ఆగ్రహం వ్యక్తంచేసి ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకోవాలని సీపీని ఆదేశించారు.
మూడు వారా ల క్రితమే సీఐ బా ధ్యతలు తీసుకు న్నా రు. కాగా, హత్యాయ త్నం కేసులో సు మం త్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గత నెల 30న జూ బ్లీహిల్స్లోని తన కార్యాలయానికి సుమంత్ సహచరులు డబ్బుల వ్యవహారంలో మాట్లాడేందుకు చెంగిచెర్లకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణను పిలిపించారు. అక్కడే ఉన్న సుమంత్, ఆయన అనుచరులు ప్రశాంత్, అరుణ్‌కుమార్‌రెడ్డి, కార్తీక్, మహేందర్‌రెడ్డి, రాము తదితరులు రాడ్లతో హరికృష్ణను తీవ్రంగా కొట్టినట్టు ఈ నెల 20న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడిపల్లి పీఎస్‌లో జీరో ఎఫ్ఐఆర్ చేసి అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌కు కేసును బదిలీ చేశారు.