హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : ఏఐకేఎస్ జాతీయ నేత, సీపీఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డికి రైతాంగం కన్నీటి వీడోలు పలికింది. రైతు ఉద్యమ నేతను కడసారి చూసేందుకు హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి రైతు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు, అన్నదాతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
నిమ్స్ దవాఖాన నుంచి సారంపల్లి మల్లారెడ్డి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం మంగళవారం ఉదయం సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. మధ్యాహ్నం12 గంటల తర్వాత మల్లారెడ్డి అంతిమ యాత్ర సీపీఎం రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రారంభమైంది. ప్రజానాట్యమండలికి చెందిన ఒగ్గుడోలు కళాకారులు, డప్పు కళాకారుల ప్రదర్శనల మధ్య గాంధీ మెడికల్ కాలేజీ వరకు అంతిమ యాత్ర సాగింది. గాంధీ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్స్ చంద్రశేఖర్, నాగమోహన్, ప్రొఫెసర్లు గౌరి, రమాదేవి సమక్షంలో మల్లారెడ్డి భౌతిక కాయాన్ని అందజేశారు.
హైదరాబాద్‌లోని సీపీఎం కార్యాలయం లో సారంపల్లి మల్లారెడ్డి భౌతికకాయానికి బీ ఆర్ఎస్ పార్లమెంటరీ నేత వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా వు, ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీ మహేశ్‌కు మార్‌గౌడ్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రా ఘవులు, పొలిట్‌బ్యూరో సభ్యులు, ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్, కేంద్ర కమిటీ సభ్యు లు తమ్మినేని వీరభద్రం, ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు అరుణజ్యోతి, మల్లు లక్ష్మి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, నాగయ్య, ఎమ్మెల్సీ కోదండరామ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, తదితరులు నివాళులర్పించారు.