అకారణంగా ఎమ్మెల్యేల సస్పెన్షన్
ప్రజాసమస్యలకు సమాధానం చెప్పడం చేతగాకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం అకారణంగా సస్పెన్షన్ వేటు వేసిందని పార్టీ నేత దినేశ్‌చౌదరి ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ మహిళా స భ్యులతో అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు.
- మహిళా ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ సర్కార్ అత్యంత దుర్మార్గం
- బీఆర్ఎస్ నేత దినేశ్‌చౌదరి
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ప్రజాసమస్యలకు సమాధానం చెప్పడం చేతగాకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం అకారణంగా సస్పెన్షన్ వేటు వేసిందని పార్టీ నేత దినేశ్‌చౌదరి ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ మహిళా స భ్యులతో అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఇటీవల బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ గుండాలు దాడికి యత్నించారని ఆరోపించారు. ఎన్నికల క్షేత్రంలో పరాభవం పాలైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమని అన్నారు.
పదేండ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్‌ను విమర్శించేస్థాయి ఆయనకు ఎక్కడిదని నిలదీశారు. 2021లో హుజూరాబాద్ నుంచి వెంకట్ పోటీ చేస్తే 1.4 శాతం ఓట్లు కూడా రాలేదని, అందుకే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కూడా ఇవ్వలేదని దెప్పిపొడిచారు. ‘బల్మూరి.. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్లో చేరుతానని కేటీఆర్ కాళ్లు పట్టుకొని ప్రాధేయపడ్డది నిజంకాదా.. ఇది నిజం కాదని నీ తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెప్పగలవా?’ అని ప్రశ్నించారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదని బీఆర్ఎస్ నేత పుట్టా విష్ణువర్ధన్ ధ్వజమెత్తారు.. రాష్ట్రంలో పాలన గాలికొదిలేసి సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులు, దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీశ్‌రెడ్డి ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

