వేములవాడ టౌన్, ఆగస్టు 25 : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి తిప్పాపురంలోని గోశాలలో ఐదు కోడెలు మృత్యువాత పడ్డాయి. గోశాలలో ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆలయ సిబ్బంది వాటి ఆలనాపాలనా చూడడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మంగళవారం ఐదు కోడెలు మృత్యువాత పడ్డట్టు తెలిసింది.
ఈ గోశాలలో పరిమితికి మించి కోడెలను ఉంచడం, అపరిశుభ్ర వాతావరణం, వాటి ఆలనా పాలనా సక్రమంగా లేకపోవం ఈ ఘటనకు నిలువెత్తు సాక్ష్యమని భక్తులు వాపోతున్నారు. ఒక వెటర్నరీ వైద్యుడిని అక్కడే విధులు నిర్వర్తించేలా చేసి రాజన్న కోడెలను రక్షించాలని భక్తులు కోరుతున్నారు.