యాదగిరీశుడికి 10.7 కోట్లు
- మేలో రికార్డు స్థాయి హుండీ ఆదాయం
- గత ఆదివారం 65 వేల మంది దర్శనం
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): వెయ్యేండ్లు వర్ధిల్లేలా, చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ ప్రభుత్వం పునర్నిర్మించిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి రోజురోజుకు ఎక్కువవుతున్నది. గుట్ట చుట్టూ పచ్చదనం, గుట్టపై స్వామివారి ఆలయం, ఆలయంలో ప్రతి శిల్పం ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడేలా చేస్తుండటంతో భక్తులు స్వామి దర్శనానికి పోటెత్తుతున్నారు.
యాదగిరీశుడిని దర్శించుకొని, ఆలయ పరిసరాలను వీక్షించి మనఃప్రశాంతతను పొందుతున్నారు. భక్తుల రాకతో ఆలయ హుండీ ఆదాయం కూడా క్రమంగా పెరుగుతున్నది. ఆలయ పునఃనిర్మాణానికి ముందు ఒక నెలలో రూ.6 కోట్లకు మించని హుండీ ఆదాయం.. ప్రస్తుతం పది కోట్లకు చేరింది. ఏప్రిల్‌లో రూ.7 కోట్లు దాటగా, మే లో రికార్డు స్థాయిలో రూ.10,74,31,531 ఆదాయం సమకూరింది.
ఈ నెల 5(ఆదివారం)న 65 వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా రూ.నాలుగున్నర లక్షల ఆదాయం సమకూరింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వీయ పర్యవేక్షణలో నిర్మితమైన ఈ ఆలయం పునఃప్రారంభమైనప్పటి నుంచి భక్తుల రాక క్రమంగా పెరుగుతున్నది. స్వామివారి దర్శనం కోసం వేల సంఖ్యలో భక్తులు బారులు తీరుతున్నారు. ముఖ్యం గా పుట్టిన రోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభదినాల్లో స్వామిని దర్శించుకొనేందుకు, పూజలు, వ్రతాలు చేసుకొనేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆలయం పునఃప్రారంభించిన నెల(ఏప్రిల్)లో రూ.7,93,99,632 ఆదాయం సమకూరగా, మే నెలలో ఒక్కసారిగా ఆదాయం రూ. 10,74,31, 531కి పెరగటం గమనార్హం.
ఈ ఏడాది మే నెలలో అత్యధికంగా
- హుండీ ఆదాయం వచ్చిన రోజులు:
- 10న రూ. 1,72,15,312
- 17న రూ. 55,09,088
- 24న రూ. 68,45,573
- 31న రూ. 70,57,165
- మేలో వచ్చిన మొత్తం ఆదాయం రూ. 10,74,31,531


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

