హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): జాతీయ లోక్ అదాలత్‌కు తెలంగాణ లో అనూహ్య స్పందన లభించింది. శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో రాష్ట్రవ్యాప్తంగా 14,18,637 కేసులు పరిషారమయ్యాయి. వీటిలో 7,03,847 ప్రీ-లిటిగేషన్ కేసులతోపాటు వివిధ క్యాటగిరీల్లోని 7,14,790 పెండింగ్ కేసులు ఉన్నాయి. లబ్ధిదారులకు రూ.911 కోట్ల పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు వెలువడ్డాయి.
హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో జరిగిన లోక్ అదాలత్‌లను జస్టిస్ అభినంద్ కుమార్ షావిలీ పర్యవేక్షించారు. వరంగల్, హనుమకొండలో నిర్వహించిన లోక్ అదాలత్‌ను జస్టిస్ మౌసమీ భట్టాచార్య వర్చువల్‌గా, జస్టిస్ కే లక్ష్మణ్ స్వయంగా ప్రారంభించారు. అనంత రం కక్షిదారులకు ఏసీజే సుజోయ్ పాల్, జస్టిస్ కే లక్ష్మణ్ పరిహార చెకులు పంపిణీ చేశారు. కేసుల పరిషార వివరాలను రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి సీహెచ్ పంచాక్షరి మీడియాకు విడుదల చేశారు.
హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యం లో జరిగిన లోక్ అదాలత్‌లో జస్టిస్ జే అనిల్ కుమార్, జస్టిస్ నందికొండ నర్సింగరావు ధర్మాసనం 165 కేసులను పరిషరించింది.