హైదరాబాద్ : గోదావరి నదిలో ప్రవాహం తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 47.10 అడుగుల మేర ప్రవహిస్తున్నది. ప్రస్తుతం 11,03,210 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నది. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఇటీవల భారీ వర్షాలత నేపథ్యంలో భద్రాచలం పట్టణ వరద ముంపునకు గురైన విషయం తెలిసిందే. భద్రాచలం వద్ద 70 అడుగులకుపైగా నీటిమట్టం చేరడంతో వరదలు పోటెత్తడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవగా.. ప్రస్తుతం వరద క్రమంగా తగ్గుతూ వస్తున్నది.