హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూ సుకుపోతున్నదని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. స్థిరాస్తి రంగం పతనమైందంటూ కొందరు ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన నరెడ్కో (నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్) 15వ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భట్టివిక్రమార్క మాట్లాడు తూ అభివృద్ధి ఇష్టంలేని వాళ్లే అలా మాట్లాడుతున్నారని చెప్పారు. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వం భూములు వేలం వేయగా ఎకరానికి రూ.177 కోట్లు పలికిన సంగతి గుర్తించాలని తెలిపారు.
హైదరాబాద్ అభివృద్ధికి ఏటా రూ.10వేల కోట్ల చొప్పున, రెండేండ్లలో రూ.20వేల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. అభివృద్ధి పనుల ఫలితాలు రావడానికి సమ యం పడుతుందని వ్యాఖ్యానించారు. మూసీ పునరుజ్జీవం గురించి మాట్లాడితే కొందరు నవ్వుకున్నారని, ఇప్పుడు ఆ ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చుతున్నదని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు, అర్బన్ క్లస్టర్స్, బ్లాలెన్సింగ్ అభివృద్ధిపై ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని వివరించారు. రాష్ట్ర పర్యాటకరంగ అభివృద్ధిలో బిల్డర్లు, రియల్టర్లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
నరెడ్కో ఆధ్వర్యంలో అట్టహాసంగా ఏర్పా టు చేసిన ఎక్స్పో జనం లేక వెలవెలబోయిందనే అభిప్రాయం అక్కడికి వచ్చిన వాళ్లలో వ్య క్తమైంది. వేదికపై డిప్యూటీ సీఎం ఏమో రియ ల్ ఎస్టేట్ దూసుకుపోతున్నదని చెప్తుంటే.. కార్యక్రమంలో మాత్రం ఆ ఉత్సాహమే కనిపించలేదని పలువురు పెదవి విరవడం కనిపించింది. గతంలో ఇలాంటి ఎక్స్‌పోలు నిర్వహిస్తే కొనుగోలుదారులు పెద్దఎత్తున వచ్చేవారని, ఏయే ప్రాంతాల్లో ఏయే కొత్త ప్రాజెక్టులు వ చ్చాయి? అని తెలుసుకునేందుకు, కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చేవారని గుర్తుచేస్తున్నారు. అలాగే ప్రముఖ కంపెనీలు తమ కొత్త ప్రాజెక్టుల గురించి స్టాల్స్ ఏర్పాటు చేసేవారని చెప్తున్నారు. కానీ శుక్రవారం ఏర్పాటు చేసిన నరెడ్కో ఎక్స్‌పోలో ఆ సందడి కనిపించకపోవడంమే డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు అవాస్తవని చెప్పేందుకు నిదర్శనమని పలువురు వ్యాపారులు అభిప్రాయం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ 22 నెలల పాలనలో హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ దారుణంగా నష్టాల పాలైందని నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఏ జెంట్లు చెప్తున్నారు. బడా కంపెనీల నుంచి కాలనీలలో బిల్డర్ల వరకు విలవిల్లాడుతున్నార ని గుర్తుచేస్తున్నారు. ఎయిర్పోర్ట్ మెట్రోను రద్దు చేయడంతో మొదలైన రియల్ పతనం.. హైడ్రా తీసుకొచ్చిన తర్వాత పతాకస్థాయికి చే రిందని వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఏ ప్రాంతంలో ఇండ్లు కూల్చి కుప్పచేస్తుందో తెలియక… మధ్యతరగతి వాళ్లు అసలు కొనుగోళ్లు చేయడమే దాదాపు ఆపారని చెప్తున్నారు. సగానికి సగం కొనుగోళ్లు, అమ్మకాలు పడిపోయాయని జాతీయ, అంతర్జాతీయ సంస్థల అధ్యయన నివేదికలతో స్పష్టమవుతున్నదని గుర్తుచేస్తున్నారు. భట్టి స్వీయకితాబులు ఇచ్చుకోవడం దారుణమని విమర్శిస్తున్నారు.