హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తేతెలంగాణ) : చాట్‌జీపీటీతో విజన్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారని, అందుకే కేసీఆర్ హయాంలో రూపుదిద్దుకున్న అద్భుతమైన సెక్రటేరియట్, కేబుల్ బ్రిడ్జ్, టీహబ్, అంబేద్కర్ విగ్రహాలను ప్రదర్శించలేదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ధ్వజమెత్తారు. రేవం త్ సర్కారు రెండేండ్ల పాలనలో కట్టించినవేవీ లేకనే కేసీఆర్ ఇంజినీరింగ్ అద్భుతాలను దాచిపెట్టిందని చురకలంటించారు. రెం డేండ్ల పాలనలో ఆ పార్టీ నేతల కుటుంబాలకు కమీషన్లు, కాంట్రాక్టులు తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదని నిప్పులు చెరిగారు.
గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రెడ్డి, కిశోర్‌గౌడ్, ప్రదీప్‌చౌదరితో కలిసి ‘రెండేండ్లలో కమీషన్లు.. కాంట్రాక్టులు.. కాంగ్రెస్ పార్టీ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రభుత్వ వైఫల్యాలు, చీకటి ఒప్పందాలను ఎండగట్టా రు. కేసీఆర్ పాలనలో తెలంగాణ గ్రోత్ స్టేట్ గా ఎదిగిందన్న ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీబ్లెయిర్ ప్రశంసలతోనైనా కాంగ్రెస్ నేతలు కండ్లు తెరువాలని హితవు పలికారు.
ఫ్యూచర్‌సిటీ ముసుగులో రియల్ ఎస్టేట్ దందాలకు తెరతీశారని ఆరోపించారు. సమ్మి ట్ సమయంలోనే సిగాచి, విరూపాక్ష కంపెనీలు కర్నూలుకు తరలిపోయాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు వ్యతిరేకిస్తున్న వంతారా ప్రాజెక్టును రేవంత్‌రెడ్డి తెలంగాణలో ఏర్పాటుచేయడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. నెల క్రితం మొదలైన ఎస్ఎల్ఆర్ సురభితో రూ.3వేల కోట్లు పెడతామ ని చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు. సీఎం అర్హత లేని సోదరుడి కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారని విమర్శించారు. భూక బ్జా కేసు ఉన్న రాఘవ కన్స్ట్రక్షన్తోనూ ఒప్పందం కుదుర్చుకున్నట్టు డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే సమ్మిట్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గ్లోబల్ సమ్మిట్ ముసుగులో లక్షలాది కోట్లు పెట్టుబడులు సాధించామని రేవంత్ సర్కారు ఊదరగొట్టడం తప్ప చేసిందేమీలేదని బీఆర్ఎస్ నేత దినేశ్‌చౌదరి ధ్వజమెత్తారు. ప్రభుత్వం చెబుతున్న పెట్టుబడుల్లో 2శాతం వచ్చినా తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పరిశ్రమల ముసుగులో ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్న కంపెనీలపై ఈడీతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
గ్లోబల్ సమ్మిట్ పేరిట కాంగ్రెస్ సర్కారు అట్టర్‌ఫ్లాప్ షో నిర్వహించిందని హరీశ్‌రెడ్డి ఆరోపించారు. ‘డేరా నగర్’లో నిర్వహించిన సమ్మిట్ పేరిట రూ.150 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ సొమ్మును వక్రమార్గంలో దక్కించుకొనేందుకు అర్హత లేని కంపెనీలతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం పెట్టుబడుల పేరిట కట్టుకథలు చెబుతున్నదని బీఆర్ఎస్ నేత కిశోర్‌గౌడ్ ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు నిజ మే అయితే ప్రతి నిరుద్యోగికీ నాలుగు ఉద్యోగాలు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కారు స్కామ్‌లపై బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.