BRS MLAs Challenge | ఉద్యోగ నియామకాలపై రాజీనామాకు సిద్ధం.. ముఖ్యమంత్రి సిద్ధమా ? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సవాల్
BRS MLAs Challenge | రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అన్ని అబద్దాలతో కాలం గడిపారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ విమర్శించారు.
హైదరాబాద్ : రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ ( Congress ) పాలనలో అన్ని అబద్దాలతో కాలం గడిపారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ విమర్శించారు. గడిచిన రెండేళ్లలో ఉద్యోగ నియమకాల ( Job recruitment ) పై ముఖ్యమంత్రికి సవాలు ( BRS MLAs Challenge ) విసిరారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డి సుధీర్ రెడ్డి, మాదవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ రాజుతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
గత ఎన్నికల్లో ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులందరూ నిరుద్యోగులకు హామీ ఇచ్చారని, నేటికి కేవలం 12 వేల 600 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే ఇచ్చిన నోటిఫికేషన్లను మాత్రమే భర్తీ చేశారని ఆరోపించారు. 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు రుజువు చేస్తే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేస్తామని, దమ్ముంటే మీరు రాజీనామా చేయాలని ముఖ్యమంత్రికి డిమాండ్ చేశారు.
ఫార్మా కంపెనీలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నగరానికి దూరంగా ఫార్మాసిటీ కోసం స్థలాన్ని ఎంపిక చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు కనిపించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్మాసిటీ స్థలంలో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి పూనుకున్నారని వెల్లడించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ రూం , కేబుల్ బ్రిడ్జితో పాటు అనేక నిర్మాణ పనులను కేసీఆర్ చేపట్టారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క కొత్త నిర్మాణ పనులు చేపట్టలేదని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన చేపట్టిందని కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ప్రజలు నివశిస్తున్న ప్రాంతంలో తాగునీరు, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు, శానిటేషన్ తదితర అభివృద్ధి చేపట్టాలని, జనాలు లేని చోట పనులు చేయడం సరైనది కాదని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

