హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల్లో చదవడాన్ని అలవాటుగా మార్చడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు పఠనోత్సవాన్ని (రీడింగ్ క్యాంపెయిన్) నిర్వహించాలని ఆదేశించింది.
దీంట్లో భాగంగా 30 నిమిషాలపాటు చదివిస్తారు. పాఠ్యపుస్తకాలు, కథల పుస్తకాలు, దిన పత్రికలు, మ్యాగ్జిన్లు వంటి వాటిని చదివించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. స్టోరీ టెల్లింగ్ మేళాలు, స్టోరీ పరేడ్స్, స్టోరీ క్రియేషన్‌పై వర్క్‌షాప్‌లు వంటివి నిర్వహించాలని సూచించారు.