జీఎస్డీపీ,తలసరి ఆదాయం,విద్యుత్తు,సాగు విస్తీర్ణం,వ్యవసాయం,అటవీ విస్తీర్ణం,మూలధన వ్యయం,ఉపాధి అవకాశాలుఇలా అన్నింటారికార్డే అభివృద్ధికి అర్థమేంటో తెలియజెప్పిన బీఆర్ఎస్ సర్కారు
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శలు గుప్పిస్తున్న వారికి ఇది చెంపపెట్టే. ఆయన పాలనలో ప్రతి రంగమూ పరిఢవిల్లిందని, దేశానికి తెలంగాణ దశ, దిశ అయిందని సాక్షాత్తు భారతీయ రిజర్వు బ్యాంకే సాక్ష్యాధారాలతో సహా వెల్లడించింది. జీఎస్డీపీ, తలసరి ఆదాయం, విద్యుత్తు, వ్యవసాయం.. ఇలా ప్రతి రంగాన్ని కేసీఆర్ అభివృద్ధిలో పరుగులు పెట్టించారని ఆర్బీఐ విడుదల చేసిన ‘హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్-2024’ నివేదికలోని గణాంకాలు కండ్లకు కట్టినట్టు చెప్తున్నాయి. పదేండ్లలోనే తెలంగాణను దేశంతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లిన కేసీఆర్ విజయగాథకు ఇంతకుమించిన తార్కాణం ఉంటుందా?
KCR | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): సంపదను సృష్టించడమే కాదు దాన్ని రెట్టింపు చేయడం ఎలాగో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం యావత్తు దేశానికి తెలియజెప్పింది. కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రానికి దశదిశను చూపడమే కాదు.. అభివృద్ధికి ప్రణాళికలను రచించడం, వాటిని సమర్థంగా అమలు చేయడం ఆషామాషీ విషయం కాదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కేవలం తొమ్మిదిన్నరేండ్లలోనే దానిని సుసాధ్యం చేసి చూపించారు. అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలుపగలిగారు. దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించారు.
ఆర్థిక వ్యవస్థకు, దేశాభివృద్ధికి కీలకంగా పరిగణించే జీఎస్డీపీ, తలసరి ఆదాయం, స్థాపిత విద్యుత్తు సామర్థ్యం, తలసరి విద్యుత్తు వినియోగం, వ్యవసాయానికి సాగునీరు, పంటల సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు, అటవీ విస్తీర్ణం, మూలధన వ్యయం.. ఇలా పలు కీలక అంశాల్లో తెలంగాణ ఎంతో పురోగతి సాధించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పదుల కొద్దీ అవార్డులు, రివార్డులు ప్రశంసలు నిదర్శనం కాగా.. జాతీయ సూచీలు, జాతీయ సంస్థల విశ్లేషణల్లో తెలంగాణను అగ్రగామిగా కీర్తించడం కేసీఆర్ పాలనకు గీటురాయి. తాజాగా రిజర్వ్ బ్యాంకు మరోసారి తెలంగాణ విజయగాధను దేశానికి చాటి చెప్పింది. పలు సూచీల ఆధారంగా రాష్ర్టాల్లోని ఆర్థిక, విద్య, వైద్య, సామాజిక పరిస్థితులను విశ్లేషిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్-2024’ను విడుదల చేసింది.
ఇందులో పదేండ్లలోనే తెలంగాణ సాధించిన ప్రగతిని కండ్లకు కట్టింది. రెండుసార్లు ప్రజలు అధికారం ఇచ్చినా అభివృద్ధి చేయలేదని మాట్లాడేవారికి చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చింది. ఏయే రంగాల్లో తెలంగాణ ఎంత ప్రగతి సాధించిందో గణాంకాలతో సహా వివరించింది. తెలంగాణ ఏర్పడిన నాటి పరిస్థితులు.. ఇప్పుడున్న పరిస్థితులను బేరీజు వేసుకుంటే పదేండ్ల పాలన సాధించిన విజయాలు అవగతం అవుతాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేనాటికి తాగు, సాగునీటికి కరువై, కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక కునారిల్లిన తెలంగాణ.. కేసీఆర్ పాలనలో ఎంత సుభిక్షంగా ఎదిగిందో, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మారిపోయాయో తెలుస్తుంది.
స్థాపిత విద్యుత్తు సామర్థ్యం పెంపు
కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో రెట్టింపు కంటే ఎక్కువ స్థాపిత విద్యుత్తు సామర్థ్యంతో దేశానికే తెలంగాణ వెలుగులదివ్వెగా మారింది.
స్థాపిత విద్యుత్తు సామర్థ్యం
మూలధన వ్యయం పైపైకి
రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలన్నా, ఆర్థిక మూలాలు పటిష్ఠం కావాలన్న ప్రభుత్వాలు మూలధనం వ్యయాన్ని పెంచాల్సిందే. ఈ విషయంలో తెలంగాణలోని అప్పటి బీఆర్ఎస్ సర్కారు మిగతా రాష్ర్టాలకు దిక్సూచిగా నిలిచింది.
మూలధన వ్యయం ఇలా..
రోడ్ల పొడవు ఇలా..
దేశానికే తల‘సిరి’
ఓ రాష్ట్ర ఆర్థిక పురోగతి తలసరి ఆదాయ వృద్ధి లెక్కల ద్వారా బయటపడుతుంది. పౌరుల తలసరి ఆదాయం పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
తలసరి ఆదాయం (ప్రస్తుత ధరల్లో)
జీఎస్డీపీలో పెరుగుదల
ఒక రాష్ట్ర ప్రగతికి జీఎస్డీపీనే కొలమానం. దేశ జనాభాలో 2.9 శాతం వాటా మాత్రమే కలిగిన తెలంగాణ.. దేశ జీడీపీలో 5 శాతం మేర వాటా కలిగి ఉంది.
జీఎస్డీపీ ఇలా..
తెలంగాణలో వెలుగు జిలుగులు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఆరంటే ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల నిరంతరాయ నాణ్యమైన విద్యుత్తును అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.
తలసరి విద్యుత్తు వినియోగం
సాగునీటి సదుపాయం పైపైకి
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ జలమాగాణమయ్యింది. కాళేశ్వరం, మిషన్ కాకతీయ పథకాలతో ఊరూరా జలసవ్వడులు మొదలయ్యాయి. దీంతో సాగు నీటి సదుపాయం రాష్ట్రవ్యాపితమైంది.
సాగునీటి సదుపాయం
అటవీ విస్తీర్ణం పెంపు
తెలంగాణకు హరితహారం పేరిట కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్రంలో అటవీవిస్తీర్ణం పెరుగడానికి దోహదంచేశాయి.
అటవీవిస్తీర్ణం పెరుగుదల
దేశానికే ధాన్యాగారం
తినడానికి సరిపడా పంట పండితే చాలు అనుకొన్న తెలంగాణ.. కేసీఆర్ దూరదృష్టి, చిత్తశుద్ధితో దేశానికే అన్నంపెట్టే స్థాయిలో ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నది.
ధాన్యం ఉత్పత్తి
నిరుద్యోగంలో తగ్గుదల
పారిశ్రామిక, ఐటీ రంగంలో కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు పెరిగాయి. దీంతో నిరుద్యోగిత రేటు భారీగా తగ్గింది.
నిరుద్యోగులు (ప్రతీ వెయ్యిమందికి) పట్టణ ప్రాంతాల్లో
గ్రామీణ ప్రాంతాల్లో
వైద్యంపై ప్రభుత్వ వ్యయం
తెలంగాణ ఏర్పడే నాటికి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. దీంతో అప్పటి సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ దవాఖానల్లో వసతులను మెరుగుపర్చారు. బడ్జెట్లో వైద్య-ఆరోగ్యరంగానికి పెద్దపీట వేశారు.
వైద్యంపై ప్రభుత్వ ఖర్చు
నవజాత శిశు మరణాల్లో తగ్గుదల
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వసతుల కల్పన, కేసీఆర్ కిట్ పథకంతో రాష్ట్రంలో నవజాత శిశుమరణాలు 60 శాతం మేర తగ్గుముఖం పట్టాయి.
ప్రతీ వెయ్యి మందికి నవజాత శిశుమరణాలు
మాంసం ఉత్పత్తిలో అగ్రగామి
అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంతో మాంసం లభ్యతలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
మాంసం లభ్యత
సాగు విస్తీర్ణంలో పెరుగుదల
తెలంగాణ ఏర్పాటు తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ సాగునీటి గోస తీర్చడంపై ప్రధానంగా దృష్టిసారించారు. ఫలితంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
సాగు విస్తీర్ణం