చండ్రుగొండ, ఫిబ్రవరి 13 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ కేజీబీవీలో ఇద్దరు విద్యార్థినులకు ఎలుకలు కరువగా.. ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని అధికారులు హె చ్చరించిన ఘటన గురువారం ఆలస్యంగా వె లుగులోకి వచ్చింది. కేజీబీవీ హాస్టల్లో ఈ నెల 11న రాత్రి విద్యార్థినులు నిద్రిస్తున్న సమయంలో పదోతరగతి విద్యార్థినులు కాకటి స్వశ్చిత, కాకటి గోపిక కాళ్లను ఎలుకలు కరిచాయి. ఈ విషయాన్ని బుధవారం కేజీబీవీ స్పెషలాఫీసర్ కవిత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారికి ప్రభుత్వ దవాఖానలో చికిత్స చేయించారు. ఈ విషయాన్ని బయట చెప్పొద్దని హాస్టల్ అధికారులు హెచ్చరించారు. ఈ విషయం తల్లిదండ్రుల ద్వారా ఎంఈవో సత్యనారాయణకు గురువారం తెలిసింది. దీంతో ఆయన హాస్టల్‌ను తనిఖీ చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.