సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 19: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండ లం నేరెళ్లలోని బాలికల గురుకుల పాఠశాలలో పలువురి విద్యార్థులను ఎలుకలు కరిచాయి. ఈ నెల 5న రాత్రి వేళ 14 మందిని ఎలుకలు కరిచాయి. ఈ నెల 6న నేరెళ్ల పీహెచ్సీలో వైద్యం చేయించారు.
ఈ నెల 9న రాత్రి 25 మం దిని మళ్లీ ఎలుకలు కరువడంతో 10న అదే పీహెచ్సీలో వైద్యం చేయించారు. ఈ విషయంపై పీహెచ్సీ వై ద్యాధికారి రేఖను వివరణ కోరగా 39 మందికి వైద్యం చేసినట్టు ధ్రువీకరించారు. ప్రిన్సి పాల్ రాధను ఫోన్లో సంప్రదించగా, అందుబాటులోకి రాలేదు.