హైదరాబాద్, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ): రేషనలైజేషన్ జీవో-25 నిబంధనలు మార్చాలని, అశాస్త్రీయమైన టీచర్ల సర్దుబాటును నిలిపివేయాలని యూఎస్పీఎస్సీ ప్రకటనలో కోరింది.
ప్రాథమిక పాఠశాలల్లో 11 మందికి ఇద్ద రు, 60 మందికి ఇద్దరు టీచర్లను కేటాయించాలని పేర్కొనడం అసంబద్ధమని పేర్కొంది. డీఎస్సీ నియామకాలు జరగాల్సిన తరుణంలో సర్దుబాటు చేయడాన్ని బట్టి ఇప్పట్లో నియామకాలు చేపట్టే ఉద్దేశ్యం లేదా? అని ప్రశ్నించింది.