ఎల్లారెడ్డి రూరల్, ఫిబ్రవరి 8: గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల కు అందించే భోజనంలో నాణ్యత కొరవడింది. ఆదివారం చికెన్ పేరిట వడ్డించిన భోజనంలో ఓ విద్యార్థినికి ఎలుక మలం రావడంతో కంగుతినాల్సి వచ్చింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో చోటుచేసుకున్నది. ఆదివారం ఏడోతరగతి విద్యార్థిని తినే భోజనంలో ఎలుక మలం వచ్చింది. అప్పుడే కేజీబీవీకి వచ్చిన తండ్రికి ప్లేటు చూపించింది. దీంతో విద్యార్థిని తండ్రి వెంటనే విద్యాలయం ప్రత్యేకాధికారితో ఫోన్లో మాట్లాడగా తాను విధుల్లో లేనని సమాధానమిచ్చారు. ఉపాధ్యాయులను పిలువగా గేటుకు తాళం వేయించి, లోనికి వెళ్లిపోయా రు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక గేటువద్ద ఆందోళనకు దిగారు.