Rat in Curd Packet | పెరుగు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక.. వరంగల్‌లో కలకలం
Rat in Curd Packet | పెరుగు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక కలకలం సృష్టించింది. గ్రేటర్ వరంగల్‌లోని ఎస్ఆర్ఆర్ తోట సమీపంలోని ఓ కిరాణ దుకాణంలో కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల కనిపించడంతో కస్టమర్ దిగ్భ్రాంతికి గురయ్యాడు.
Rat in Curd Packet | పెరుగు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక కలకలం సృష్టించింది. గ్రేటర్ వరంగల్‌లోని ఎస్ఆర్ఆర్ తోట సమీపంలోని ఓ కిరాణ దుకాణంలో కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల కనిపించడంతో కస్టమర్ దిగ్భ్రాంతికి గురయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ ఎస్ఆర్ఆర్ తోట సమీపంలోని కిరాణ షాపులో ఓ వ్యక్తి సంగం పెరుగు ప్యాకెట్ కొని ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ప్యాకెట్‌ను కట్ చేసి పెరుగు వేసుకోబోతుండగా అందులో ఎలుక పిల్ల కనిపించింది. అది చూసిన వ్యక్తి ఒక్కసారిగా కంగుతిన్నాడు. తర్వాత తేరుకుని కిరాణ షాపు యజమానిని నిలదీశారు.
అనంతరం సంబంధిత అధికారులకు వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు పెరుగు ప్యాకెట్ విక్రయించిన షాపును పరిశీలించారు. వెంటనే ఆ బ్యాచ్‌కు సంబంధించిన పెరుగు ప్యాకెట్ అమ్మకాలను నిలిపివేశారు. జనగామలో 50 ప్యాకెట్లు, కరీమాబాద్, లక్ష్మీపురం మార్కెట్ ఏరియా, హనుమకొండ భవానీనగర్ షాపుల్లో ఆ బ్యాచ్‌కు చెందిన పెరుగు ప్యాకెట్లను సీజ్ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సంగం పెరుగును విక్రయించవద్దని షాపు నిర్వాహకులకు అధికారులు జారీ చేశారు.
కాగా, ఆ బ్యాచ్‌కు సంబంధించిన పెరుగు అమ్మకాలను నిలిపివేయడంతో పాటు శాంపిల్స్‌ను పరీక్షించేందుకు హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
పెరుగు ప్యాకెట్లో ఎలుక కలకలం
వరంగల్ ఎస్‌ఆర్‌ఆర్‌తోట సమీపంలోని ఓ కిరాణా షాపులో కొనుగోలు చేసిన సంగం పెరుగు ప్యాకెట్లో ఎలుకను చూసి కంగుతిన్న వ్యక్తి
పెరుగు ప్యాకెట్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లి కట్ చేయగా, అందులో చనిపోయిన ఎలుక పిల్ల రావడంతో, కిరాణా షాపు యజమానిని నిలదీసి… pic.twitter.com/D2PRjnNeF4
— Telugu Scribe (@TeluguScribe) June 23, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

