మానకొండూర్, జూన్ 24 : ఇందిరమ్మ ఇండ్ల పేరిట జిమ్మిక్కులు చేస్తున్న రేవంత్‌ను ప్రజలు నమ్మరని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అర్హులకు మొండిచేయి చూ పుతున్నారని, పార్టీ కార్యకర్తలు, భూము లు, ఇండ్లు ఉన్న వారికే ఇండ్లు కేటాయించారని మండిపడ్డారు. మానకొండూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం మీడియాతో రసమయి మాట్లాడారు.
మానకొండూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 48 వేల మందిని గుర్తించి, ఇప్పుడు 3,200 మందికే ఇస్తున్నామని చెప్పడం విస్మయం కలిగిస్తున్నదన్నారు. ఇల్లంతకుంట మండలం గుండారంలో ఒక్క ఎస్సీ కుటంబానికి కూడా ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదంటే ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయో ప్రజలు గమనించాలని కోరారు. 26న మానకొండూర్‌లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని మహాధర్నా చేపట్టనున్నట్టు వెల్లడించారు.