హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం చెప్తున్నదని, ఈ సమావేశంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు వీడియోల ద్వారా తెలుస్తున్నదని, కౌశిక్‌రెడ్డి మాట్లాడింది తప్పయితే మరి సంజయ్ మాట్లాడింది కూడా తప్పే అవుతుంది కదా? అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నించారు.
ఆరు గ్యారెంటీలపై ప్రశ్నిస్తున్నందుకు కాంగ్రెస్ సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని, పాలన ఎమర్జెన్సీ ని తలపిస్తున్నదని మండిపడ్డారు. కౌశిక్‌పై 4 అక్రమ కేసులు పెట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో చింతం సదానందం తో కలిసి సోమవారం ఆయన మాట్లాడుతూ సంజయ్ ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నారని కౌశిక్ అడిగితే అది రౌడీయిజమని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యే లు అనడం విడ్డూరమని మండిపడ్డారు. కౌశిక్ ఇం టిపై దాడి చేసిన అరికెపూడిపై, బీఆర్ఎస్ భువనగిరి ఆఫీస్‌పై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలపై ప్రభు త్వం ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు.