హైదరాబాద్ : రైలుపట్టాల కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య(commits suicide)కు పాల్పడిన విషాదకర సంఘటన బుధవారం హఫీజ్ పేట(Hafiz Peta)లో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన యార్లగడ్డ రాంబాబు నగరంలోని కొండాపూర్లో ఉంటూ ర్యాపిడో డ్రైవర్(Rapido driver)గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల కాలంలో అప్పుడు పెరిగిపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.