హైదరాబాద్, మార్చి 19 (నమస్తేతెలంగాణ): తెలంగాణలో ఏర్పాటు చేయనున్న మూడో విద్యుత్ పంపిణీ సంస్థ (రైతు డిస్కం) ఏర్పాటు పనులు వేగంగా కొన సాగుతున్నాయి. డిస్కం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. ఒక సీనియర్ ఐఏఎస్‌ను చైర్మన్ అండ్ ఎండీగా, ఇతర డిస్కంలలో పనిచేస్తున్న నలుగురి అధికారులను డైరెక్ట ర్లుగా నియమించింది.
ఇక రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు లైసెన్స్ కోసం గురువారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు దరఖాస్తు చేసింది. ఈ సందర్భంగా టీజీఆర్పీడీసీఎల్ చైర్మన్ అండ్ ఎండీ ముషారఫ్ ఫరూఖీ మాట్లాడుతూ మార్చి 18న కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి టీజీఆర్పీడీసీఎల్ స్థాపనకు ఆమోదం లభించిందని తెలిపారు.